
అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం ముఠా గుట్టు రట్టయింది. నకిలీ మందు తయారీ కోసం ఏకంగా పెద్ద సెటప్ ఏర్పాటు చేసిన లిక్కర్ డాన్లను అరెస్టు చేశారు ఎక్సైజు పోలీసులు. శనివారం (అక్టోబర్ 10) తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొలకలచెరువు మండల కేంద్రంలో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టుకున్నారు.
ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో సుమారు కోటి డెబ్బై అయిదు లక్షల రూపాయల (1.75 కోట్లు) విలువైన నకిలీ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆడులలో నిర్వాహుకులు ఏర్పాటు చేసిన సెటప్ చూసి షాకింగ్ కు గరయ్యారు పోలీసులు.
కళ్ళు చెదిరిపోయేలా అత్యాధునికమైన యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తఉన్నారు లిక్కర్ డాన్లు. ఈ దాడులలో 35 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 క్యాన్ల నకిలీ మద్యం, 17 వేల224 మద్యం బాటిళ్లు , ఖాళీ మద్యం సీసాలు, వివిధ బ్రాండ్ల కు సంబంధించిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.
►ALSO READ | తిరుపతిలో వర్ష బీభత్సం... చెరువులైన రోడ్లు.. మునిగిపోయిన రైల్వే అండర్ బ్రిడ్జిలు..