ఒక్కరోజులోనే రూ. 156 కోట్ల మద్యం తాగేసిన్రు

ఒక్కరోజులోనే  రూ. 156 కోట్ల మద్యం తాగేసిన్రు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం  ఏరులై పారింది. రికార్డు స్థాయిలో అమ్మకాలలతో భారీగా భారీగానే ఆదాయం సమకూరింది.  డిసెంబరు 31 ఒక్కరోజే  ఏపీలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి.  ఒక్క రోజులో ఏపీవ్యాప్తంగా రూ. 156.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగనట్లు  ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.  1.51 లక్షల కేసుల మద్యం, 67 వేల కేసుల బీర్లు విక్రయించారు.  

ఇక  తెలంగాణలో మూడు రోజుల్లో అంటే  ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి.  మూడు రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేస్​లు, 6.31 లక్షల బీర్ కేస్​లు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ సేల్ కావడం గమనార్హం. 

డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వడం, రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది.