Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా

Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3గంటలకు బెయిల్ పై ఉత్తర్వులు జారీ చేస్తామని రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, అందుకే నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశముందని జస్టిస్ నాగ్ పాల్ దృష్టికి తెచ్చారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పును వారం పాటు వాయిదా వేశారు. 
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. నిజానికి గత నెల 23నే న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఫిబ్రవరి 9న ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించింది. తాజాగా కేసు విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును 16వ తేదీకి వాయిదా వేసింది.