Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు అరెస్టైన వాళ్లు వీళ్లే.. 

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు అరెస్టైన వాళ్లు వీళ్లే.. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్  కేసులో ఈడీ విచారణ వేగంగా సాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కుమార్తె కవితను విచారిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ చేశారు అధికారులు. అరెస్ట్ అయిన వారు ఎవరు.. ఎప్పుడెప్పుడు వారిని అరెస్ట్ చేసింది అనేది చూద్దాం.

>>> సమీర్ మహేంద్రు :

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1 ముద్దాయిగా ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్రును సెప్టెంబర్ 28న ఈడీ అరెస్ట్  చేసింది ఈడీ . సెక్షన్ 45, ప్రివెన్ష ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద సెప్టెంబర్ 30న అతనిపై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది.   

>>> పి. శరత్ చంద్రా రెడ్డి : 

అరబిందో గ్రూప్ - ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రా రెడ్డిని నవంబర్ 11న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో బినోయ్ బాబుతో కలిసి శరత్ చంద్రా రెడ్డి రిటైల్ లైసెన్స్ లు ఇప్పించినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది.

>>> బినోయ్ బాబు : 

పెర్నోడ్ రిచర్డ్ ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్ కంపెనీ జనరల్ మేనేజర్ బినోయ్ బాబును ఈడీ.. నవంబర్ 11న శరత్ చంద్రా రెడ్డితో పాటు అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌‌లో పేర్కొన్న 31 లైసెన్సుల్లో బినోయ్‌‌ బాబు 29 లైసెన్సులను రిటైల్‌‌ వ్యాపారులకు ఇప్పించినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారంలో వెల్లడైంది. ఇందులో అక్రమ లావాదేవీలను సైతం ఈడీ గుర్తించింది.

>>> అభిషేక్ బోయినపల్లి :   

లిక్కర్​ స్కామ్ ​లో రాష్ట్రం నుంచి అరెస్టయిన తొలి వ్యక్తి అభిషేక్ రావు. ఈడీ.. అభిషేక్ ని నవంబర్ 13న అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది. మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావుకు రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో రూ.3.85 కోట్లు అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండోస్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రుకు వచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ముందుగా సౌత్‌‌ లాబీ పేరుతో ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొంది. 

>>> విజయ్ నాయర్: 

ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్​ను ఈడీ నవంబర్ 13న అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీపై అక్రమ లావాదేవీలు సరిపాడని ఈడీ విజయ్ నాయర్ ను అరెస్ట్  చేసింది. లిక్కర్ పాలసీపై ఏదైనా విచారణ జరిగితే అసలు నిందితులు దొరకకూడదనే ఉద్దేశంతో విజయ్ వ్యవహరించాడు. లిక్కర్ పాలసీ–2021లో మార్పులు చేసేలా ప్రైవేటు లిక్కర్ హోల్ సేలర్ల నుంచి డబ్బులు సమీకరించాడు. 

>>> అమిత్ అరోరా: 

బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్ అమిత్ అరోరాను ఈడీ నవంబర్ 29న అరెస్ట్ చేసింది. ఈయన ఢిల్లీ మద్యం వ్యాపారాలు జరుపుతుంటారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు. 

>>> గౌతమ్ మల్హోత్రా: 

ఫిబ్రవరి 8న ఢిల్లీ లిక్కర్ స్కాంలో గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీకి వ్యతిరేఖంగా స్కాం జరిపినట్లు ఈడీ వెల్లడించింది. గౌతమ్.. అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తిచింది.

>>> రాజేష్ జోషి: 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ..  ఫిబ్రవరి 9న చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజేష్ జోషిని అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు.

>>> మనీష్ సిసోడియా : 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్‌ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారు. పలు లావాదేవీలపై అనుమానాలతో పాటు, లిక్క స్కాంకు రూపకల్పన వహించాడనే ఆరోపనలు ఎదుర్కొంటున్నాడు. 

>>> మాగుంట రాఘవ: 

ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కొడుకు మాగుంట రాఘవను ఈడీ అధికారులు ఫిబ్రవరి 11న అరెస్ట్ చేశారు. రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్లో రాఘవ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.  

>>> అమన్ దీప్ దల్  సింగ్ : 

ఢిల్లీ వ్యాపారవేత్త అమన్ దీప్ దీప్ సింగ్ ను మార్చి 2న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూపుతో అమన్ దీప్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని, ఆప్ ఫంక్షనరీ విజయ్ నాయర్, మనోజ్ రాయ్ లతో పాటు అమన్దీప్ సింగ్ కూడా కీలకపాత్ర పోషించారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో తెలిపింది.  

>>> అరుణ్ రామచంద్ర పిళ్ళై: 

కవిత బినామీగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. సులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున  కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ.