గుర్తుపెట్టుకోండి : నవంబర్ నెలలో థియేటర్లు, OTTల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్

గుర్తుపెట్టుకోండి : నవంబర్ నెలలో థియేటర్లు, OTTల్లో రిలీజ్ అయ్యే  సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్

దసరా కానుకగా రిలీజైన బడా హీరోలమూవీస్తో బాక్సాపీస్ లెక్కల నగరా మోగుతూ వచ్చింది. బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీస్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు నవంబర్ వంతు వచ్చింది. మరి ఇప్పుడు ఏ హీరో హవా నడుస్తుందో..ఏ మూవీ ఓటీటీ, థియేటర్ లో గెలుస్తుందో ఒక లుక్కేద్దాం. 

థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్

కీడా కోలా :

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. లేటెస్ట్ ఆయన రైటర్, డైరెక్టర్, యాక్టర్ గా చేసిన మూవీ కీడా కోలా(Keedaa Cola).

30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు(Chaitanya Rao), రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ మూవీ..సిడార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

పొలిమేర 2 :

మా ఊరి పొలిమేర (Maa oori Polimera)..అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇది. సత్యం రాజేష్ (Sathyam rajesh), బాలాదిత్య (Baladithya), గెటప్ శ్రీను (Getup srinu) ప్రధాన పాత్రలో అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. చేతబడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులకైతే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.

ఈ సినిమా సీక్వెల్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కి..థ్రిల్ ఇచ్చే న్యూస్ ఇదే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆడియన్స్ అంతలా ఎదురు చూసిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.

నరకాసుర

పలాస మూవీతో మంచి హిట్ అందుకుని..తెలుగు ఆడియాన్స్ కు చేరువైన హీరో రక్షిత్ అట్లూరి లేటెస్ట్ మూవీ నరకాసుర (Narakasura). పలాస తరహాలోనే రా అండ్ రస్టిక్ సినిమాతో రక్షిత్ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా..ఈ మూవీపై ఆడియన్స్ కు అంచనాలున్నాయి. ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

ఆదికేశవ 

ఉప్పెన, రంగరంగా వైభవంగా, కొండపొలం చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్‌‌తో ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్(VaishnavTej). ఇప్పుడు ఆదికేశవ (Aadikeshava) అనే యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌తో  ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్నఈ మూవీని శ్రీకాంత్ ఎన్.రెడ్డి (SrikanthNReddy) డైరెక్ట్ చేస్తున్నారు. 

ఆదికేశవ మూవీ 2023 నవంబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లో  రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మైనింగ్ కోణంలో రాబోతున్నట్లు సమాచారం. 

వ్యూహం 

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం (Vyuham). ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వ్యూహం, శపథం అనే టైటిల్స్ తో రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ వ్యూహం నవంబర్ 10 న థియేటర్లో రిలీజ్ కానుంది. 

మంగళవారం 

ఆర్ఎక్స్100 (RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం (Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో..పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్‌ 17న థియేటర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌,టీజర్ సాంగ్స్ రిలీజ్ అవ్వడంతో..జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు అసలు మంగళవారం రాగానే ఊరిలో జరిగే హత్యలను..ఎవరు చేశారు? అనే ప్రశ్నలతో ట్రైలర్ లో చూపించిన తీరు ఇంటెన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

స్పార్క్ L.I.F.E 

విక్రాంత్(Vikranth) హీరోగా..మెహరీన్(Mehreen), రుక్సార్ (Rukshar) లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ స్పార్క్ L.I.F.E (Spark). ఈ సినిమాతో హీరో విక్రాంత్ పరిచయం అవుతుండడంతో పాటు..డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. 

లవ్ స్టోరీ..కాస్తా క్రైమ్ యాంగిల్ లోకి మారడం..ఒక అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి వరుసగా హత్యలకు గురవ్వడం వంటి థ్రిల్లింగ్  సీన్స్ తో ట్రైలర్ తోనే ఆసక్తి కలిగించారు మేకర్స్. ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.  

కళ్యాణ్ రామ్ డెవిల్ 

నందమూరి కళ్యాణ్ రామ్ (NandamuriKalyan Ram) ఫస్ట్ టైం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మూవీ డెవిల్. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చేశారు మేకర్స్. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నవంబర్ 24 న థియేటర్లో రిలీజ్ కానుంది. 

అంబాజీపేట మ్యారేజి బ్యాండు

సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని నాగరం హీరోయిన్‌‌. జీఏ2 పిక్చర్స్‌‌తో కలిసి వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కామెడీ, ఎమోషన్ తో తెరకెక్కగా..జగదీష్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ మరియు శరణ్య ప్రదీప్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. 
ఈ మూవీ నవంబర్ 25న థియేటర్లో రిలీజ్ కానుంది. 

బాలీవుడ్ 

త్రీ ఆఫ్ అజ్ 

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విడిపోయిన ఫ్రెండ్స్..17 ఏండ్ల త‌ర్వాత క‌లుసుకున్నాక వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది స్టోరీ. లవ్ & ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ సమర్పణలో న‌వంబ‌ర్ 03న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

టైగర్ 3 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్  స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ 3 (Tiger 3). యశ్ రాజ్ ఫిలిమ్స్(Yash raj films) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ(Maneesh sharma) తెరకెక్కిస్తున్నారు. కత్రినా కైఫ్(Katrina kaif) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నవంబర్ 12 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. 

ది లేడీ కిల్లర్

అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది లేడీ కిల్లర్’. అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రొమాంటిక్ లవ్ ఎమోషన్ కథాంశంతో రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది.

కోలీవుడ్ 

జపాన్ 

తమిళ స్టార్ హీరో కార్తి (Karthi), అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జపాన్ ( J apan). రాజు మురుగన్(Raju Murugan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కార్తికి 25వ మూవీగా వస్తోంది.క్రైమ్, రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ (జపాన్).. ఓ దొంగ పాత్రను పోషించారు. కార్తి లుక్స్, డైలాగ్ చెప్పే మ్యానరిజం అదిరిపోయింది. ఈ మూవీ నవంబర్ 10న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ కానుంది. 

ధ్రువ నక్షత్రం

స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా వస్తోన్న ధ్రువ నక్షత్రం మూవీ న‌వంబ‌ర్ 24న థియేటర్లో రిలీజ్ కానుంది. 

ఇడమ్‌ పొరుళ్‌ ఎవల్‌

విజయ్‌ సేతుపతి, విష్ణు విశాల్, నటి ఐశ్వర్య రాజేశ్‌, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇడమ్‌ పొరుళ్‌ ఎవల్‌’. ఈ మూవీ 2014 లోనే రిలీజ్ కావాల్సి ఉండగా..ఫైనాన్సియల్ ఇష్యూస్ తో ఆగిపోయి..మళ్ళీ రిలీజ్ కు సిద్దమయింది. ఈ మూవీ18 నవంబర్ 2023 న థియేటర్లో రిలీజ్ కానుంది. 

 రైడ్

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన రైడ్ మూవీ 2023 నవంబర్ 12న రిలీజ్ కానుంది 

హాలీవుడ్ 

ది మార్వెల్స్‌

మార్వెల్‌ యూనివర్స్ నుంచి వచ్చే మూవీస్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా..అందరు ఈ సిరీస్‌ లో వచ్చే మూవీస్ కోసం ఎదురు చూస్తుంటారు. ముగ్గురు సూపర్‌ ఉమెన్స్‌ కలిసి నటిస్తున్న ‘ది మార్వెల్స్‌’  మూవీ నవంబర్‌ 10న థియేటర్లో రిలీజ్ కానుంది. 

నెపోలియన్

నెపోలియన్ అనేది ఎపిక్ హిస్టారికల్ డ్రామా చిత్రం. రిడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ కానుంది. 

ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్, వెబ్ సీరీస్:

బోయపాటి 'స్కంద' (మూవీ) - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (నవంబర్ 2)
ఆర్ యూ ఓకే బేబీ (సినిమా) - అమెజాన్ ప్రైమ్ వీడియో (నవంబర్ 2)
షారుఖ్ 'జవాన్' (మూవీ) - నెట్‌ఫ్లిక్స్ (నవంబర్ 2)
ఆర్య సీజన్ 3 (వెబ్ సిరీస్) - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (నవంబర్ 3)
ఆల్ ద లైట్ వీ కెన్ నాట్ సీ (వెబ్ సిరీస్) - నెట్‌ఫ్లిక్స్ (నవంబర్ 2)

పీ.ఐ. మీనా (వెబ్ సిరీస్) - అమెజాన్ ప్రైమ్ వీడియో (నవంబర్ 3)
స్కామ్ 2003 వాల్యూమ్ 2 (వెబ్ సిరీస్) - సోనీ లివ్ (నవంబర్ 3)
గోల్డా- (లయన్స్‌గేట్ ప్లే) నవంబర్ 3న 


ది బక్కనీర్స్ (సిరీస్) - Apple TV నవంబర్ 8న 
రాబీ విలియమ్స్ (డాక్యుమెంటరీ) - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 8న 
ది శాంటా క్లాజ్ సీజన్ 2 - (డిస్నీ+ హాట్‌స్టార్) నవంబర్ 8న 

ఎట్ టు కమ్- కన్సర్ట్ ఫిల్మ్ (అమెజాన్ ప్రైమ్) నవంబర్ 9న

007: రోడ్ టు ఎ మిలియన్ (రియాలిటీ సిరీస్) - (అమెజాన్ ప్రైమ్ వీడియో) నవంబర్ 10న

ది కిల్లర్ - (నెట్‌ఫ్లిక్స్) నవంబర్ 10న

వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్ (లయన్స్‌గేట్ ప్లే) నవంబర్ 10న

ఎ మర్డర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ (సిరీస్) - (డిస్నీ+ హాట్‌స్టార్) నవంబర్ 14

అపూర్వ  - (డిస్నీ+ హాట్‌స్టార్) నవంబర్ 15న 
 

క్రౌన్ సీజన్ 6 పార్ట్ 1 - (నెట్‌ఫ్లిక్స్) నవంబర్ 16న 
బెస్ట్ క్రిస్మస్ . ఎవర్ (నెట్‌ఫ్లిక్స్) నవంబర్ 16న 
 

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (సిరీస్) - Apple TV నవంబర్ 17న 
రస్టిన్ - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 17న 
రైల్వే మెన్ (సిరీస్) - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 17న 
 

స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (రియాలిటీ సిరీస్) - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 22న 
ఫ్యామిలీ స్విచ్  - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 30