ఈ 13 ఐడీ ఫ్రూప్స్ లో ఒకటి ఉంటే చాలు.. ఓటేయొచ్చు

ఈ 13 ఐడీ ఫ్రూప్స్ లో ఒకటి ఉంటే చాలు.. ఓటేయొచ్చు

ఎన్నికల్లో ఓటేయాలంటే ఓటరు గుర్తింపు కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి. ఒకవేళ ఇది లేకపోతే ఎన్నికల సంఘం సూచించిన పలు గుర్తింపు కార్డులను తీసుకెళ్లవచ్చు.  ఈ 12 ఐడీ ఫ్రూప్స్ లో ఏ ఒక్కటున్న చాలు ఓటేయచ్చు. గుర్తింపు కార్డు లేకున్నా  దానికి ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర  ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది.  ఓటు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారణకు పంపిణీ చేసిన ఓటరు స్లిప్‌లు చూపిస్తే సరిపోతుంది.  

ఆధార్‌కార్డు, ఎంఎన్‌ఆర్‌జీఏ జాబ్‌కార్డు, పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్‌, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్‌ మంజూరు డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు .  ఈ  కార్డుల్లో ఏదైన ఒక కార్డును తీసుకుని.. పోలింగ్‌ బూతులో చూపించి ఓటు వేయోచ్చు.  

మరోవైపు తెలంగాణలో రేపు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు సమావేశాన్ని నిషేధిస్తూ CRPC సెక్షన్ 144 డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. అటు వైన్స్ షాపులు కూడా మూతపడ్డాయి.