పెళ్లొద్దు.. పిల్లలు అసలే వద్దు : చైనాలో 20 శాతం పడిపోయిన పెళ్లిళ్లు

పెళ్లొద్దు.. పిల్లలు అసలే వద్దు : చైనాలో 20 శాతం పడిపోయిన పెళ్లిళ్లు




చైనా ... టెక్నాలజీలో ప్రపంచంలో ముందుంటుంది.  ఆ దేశంలో జనాభా కూడా ఎక్కువే.  అయితే రెండు దశాబ్దాల కాలం నుంచి జనాభా తగ్గిపోతుంది. దీనికి కారణం పెళ్లంటే చైనా యూత్​ ఆవడ దూరం పరిగెత్తుతున్నారు.  ఎవరైనా ఒకళ్లో ఇద్దరో పెళ్లి చేసుకున్న పిల్లలను కనేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో గతంతో పోలిస్తే చైనాలో 20 శాతం పెళ్లిళ్లు పడిపోయాయి.  చైనా యూత్​ .. పెళ్లొద్దు.. పిల్లలు అసలే వద్దు అంటున్నారు. 

యువత పరిస్థితి... . ఎవరి ప్రపంచం వారిదే అయిపోతోంది. ప్రేమించుకుంటున్నారు...  కలిసి తిరుగుతున్నారు.. అంతా బాగానే ఉంది. కానీ పెళ్లి దగ్గరకు వచ్చే సరికి ఎవరు నువ్వు అంటున్నారు. పెళ్లి వద్దు.. మిగతా అన్నీ ఓకే అంటున్నారు. వాళ్లను ఒప్పించడం, పెళ్లి చెయ్యడం తల్లిదండ్రుల వల్ల కావట్లేదు.  యువత .. పెళ్లికో దండం అంటున్నారు. ప్రస్తుతం చైనాలో పెళ్లి చేసుకునే వారిసంఖ్య తగ్గిపోతుంది. 2023 తో పోలిస్తే 2024 లో 20 శాతానికి పడిపోయింది. 

టెక్నాలజీలో ముందున్న చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతుంది. బ్రహ్మచారులుగానే  గడిపిన వృద్దుల సంఖ్యపెరుగుతుంది.  ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ విషయంలో చైనా రెండో స్థానంలో ఉంది.  అయినా అక్కడ యూత్​  సోలో బ్రతుకే .. సో బెటర్​ అంటున్నారు.  చైనా దేశ వ్యాప్తంగా గతేడాది (2024) లో 61 లక్షల వివాహాలు మాత్రమే జరిగాయి.  2023 లో 77 లక్షలు పెళ్లిళ్లయ్యాయి.  అంటే పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య 20 శాతానికి పడిపోయింది.  

జనాభా పెరుగుదల కోసం చైనా  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్కడి యువత మాత్రం వివాహాల వైపు మొగ్గు చూపడం లేదు. బ్లూమ్​ బెర్గ్​​ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం. . 2024లో దేశవ్యాప్తంగా 61లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు  నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 20.5శాతం తగ్గాయి. వివాహాల రిజిస్ట్రేషన్‌ మొదలుపెట్టిన 1986 నుంచి ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. 2013లో 1.3 కోట్ల వివాహాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య సగానికంటే తక్కువగా నమోదైంది...  చైనా యూత్​ ద్రవ్యోల్బణం,., ఆర్థిక వ్యవస్థ క్షీణత కారణంగా  పెళ్లి చేసుకొనేందుకు ఆశక్తి చూపడం లేదు,  కుటుంబ ఖర్చుల కారణంగా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. 

తక్కువ జనన రేటు నమోదవుతున్న చైనాలో ఉన్న ఒకే ఒక అవకాశం.. ఇక్కడ ఉన్న యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనడమే.  ప్రభుత్వం దీని కోసం ప్రజలను ప్రోత్సహిస్తోంది, కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒకే బిడ్డ విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు జనాభాను ఒకేసారి పెంచలేకపోతోంది. చైనాలో పిల్లలు కనాలంటే తల్లి, తండ్రి పెళ్లి నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ సంక్లిష్టతను నిర్వీర్యం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.   పెళ్లి  కాని యువత కూడా పిల్లలను కనగలిగేలా చేసేందుకు ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంది.

చైనాలో ఫేమస్​ నగరాల్లో బీజింగ్​ వంటి ప్రదేశాల్లో నివసించాలంటే ఇంటి అద్దెలు భారీగా ఉంటాయి.  అపార్ట్​ మెంట్​ మీటరు స్థలం కొనాలంటే ఏడాది జీతం కంటే ఎక్కువుగా ఉంటుంది. 16 నుంచి 24 సంవత్సరాల వయస్సు ఉన్న చైనీయులను  పరిశీలిస్తే ప్రతి ఆరుగురిలో ఐదుగురు నిరుద్యోగులుగా ఉన్నారని  బ్లూమ్​ బెర్గ్​​ ​ నివేదిక ద్వారా తెలుస్తుంది. 

చైనాలో  జననాల రేటును పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అసలు దంపతులు కలిసి ఉండటానికే ఇష్టపడట్లేదు. ఇక సంతాన సాఫల్యం ఎక్కడ? ఇటు పెళ్లిళ్లూ జరక్క, అటు జనాభా కూడా పెరక్క.. ఆ దేశంలో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఈ సమస్య అన్ని రంగాల్లోనూ లేబర్ కొరతకు కారణం అవుతోంది. ఇది మున్ముందు మరింత ఎక్కువ అవుతుందనే ఆందోళన ఉంది.