IPL2025: ఆగిపోయిన ఐపీఎల్ హిస్టరీ ఇదే..

IPL2025: ఆగిపోయిన ఐపీఎల్ హిస్టరీ ఇదే..

భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంతో ఐపీఎల్ 18 మిగతా సెషన్ ను వాయిదా వేస్తున్నట్లు   బీసీసీ కీలక ప్రకటన చేసింది.  ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మిగతా మ్యాచ్ లన్నింటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మే 8న ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ అర్థాంతరంగా రద్దు చేసిన బీసీసీఐ మే 9న అత్యవసరంగా సమావేశమై తదుపరి ఐపీఎల్ మ్యాచ్ లన్నింటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 

ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లు

మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్  మే 25న ముగియాల్సి ఉంది. మొత్తం 74  మ్యాచులు 65 రోజులపాటు జరగాల్సి ఉంది.  మే 20న  క్వాలిఫయర్‌ 1 (హైదరాబాద్‌ లో), మే 21న ఎలిమినేటర్‌ (హైదరాబాద్‌ లో )మే 23న క్వాలిఫయర్‌ 2 ( కోల్‌కతాలో) మే 25న  ఫైనల్‌ ( కోల్‌కతాలో)  జరగాల్సి ఉంది.  అయితే భారత్ పాక్ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా  ఇప్పటి వరకు అంటే మే 8(పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ )తో కలిపి  58 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి.  మిగతా 16 మ్యాచ్ లు ఎపుడు ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై బీసీసీఐ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.

 టాప్ లో  గుజరాత్ 

ఐపీఎల్ 18 సీజన్ లో మొత్తం  10 జట్లు పోటీ పడగా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో గుజరాత్ టైటాన్స్ జట్టు టేబుల్ లో 16 పాయింట్లతో (0.793)రన్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉంది. తర్వాత స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో రన్ రేట్ (0.482) కారణంగా రెండో ప్లేస్ లోఉంది.  తర్వాత మూడో స్థానంలలో  15 పాయింట్లతో పంజాబ్, 14  పాయింట్లతో ముంబై నాల్గో స్థానంలో ఉన్నాయి.

నాలుగు జట్లు  ఎలిమినేట్ 

 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఢిల్లీ,  11 పాయింట్లతో  కోల్ కతా ఆరోస్థానం, 10 పాయింట్లతో  లక్నో ఏడో స్థానంలో ఉన్నాయి. ఇక  సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నమెంట్  ఎలిమినేట్ అయ్యాయి. 

 టాప్ స్కోరర్ గా సూర్య కుమార్ యాదవ్

ఐపీఎల్ 18 సెషన్ లో  12 ఇన్నింగ్స్ లు ఆడిన ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 510 రన్స్ తో టోర్నమెంట్ టాపర్ గా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో  గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ 509, శుభ్ మన్ గిల్ 508, ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ 505,  గుజరాత్ బ్యాట్స్ మెన్ బట్లర్  500 పరుగులతో  ఉన్నారు. 

20 వికెట్లు తీసిన ప్రసిద్ద కృష్ణ

  గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ 11 ఇన్నింగ్సుల్లో  20 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత  చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 12 ఇన్సింగ్సులు ఆడి 20 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక  ఆర్బీసీ నుంచి హజిల్ వుడ్, ముంబై నుంచి ట్రెన్ట్ బౌల్ట్ చెరో 18 వికెట్లతో మూడు, నాలుగు స్థానంలో ఉన్నారు.

అభి షేక్

అత్యధిక వ్యక్తిగత స్కోర్ : అభిషేక్ వర్మ 144 పరుగులు (సన్ రైజర్స్)

అత్యధిక సిక్సులు: నికోలస్ పూరన్ 34 (లక్నో)

అత్యధిక స్కోర్ జట్టు: 286 ( సన్ రైజర్స్)