కంగారు పడకండిరా బాబు.. పెట్రోల్- గ్యాస్ షార్టేజీపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

కంగారు పడకండిరా బాబు.. పెట్రోల్- గ్యాస్ షార్టేజీపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

Petrol Stock: సరిహద్దుల్లో యుద్ధం దాయాది దేశంతో రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగదును నిల్వ చేసుకోవటంతో పాటు కొన్ని వారాలకు సరిపడా నిత్యావసరాలను కూడా స్టాక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మందిలో ఇంధన నిల్వలపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి.

ప్రజల్లో ఒక్కసారిగా ఇంధనం, గ్యాస్ వంటి వాటిపై ఆందోళనలు పెరగటంపై భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అనుమానాలను క్లియర్ చేసింది. తమ వద్ద అవసరాలకు మించిన స్థాయిలో ఇంధన నిల్వలు ఉన్నాయని, అలాగే తమకు ఆయిల్ సరఫరా మార్గాలు ఇబ్బందులు లేకుంగా పూర్తిగా సాఫీగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఎక్కడా ఎలాంటి షార్టేజీలు లేవని హామీ ఇచ్చింది.

Also Read : కరాచీ బేకరీ పుట్టుకపై వివాదం

 

ప్రజలు ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇంధనం గురించి, గ్యాస్ నిల్వల గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా తన ఔట్ లెట్లలో స్టాక్ ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందని అనవసరమైన అనుమానాలను మానుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తమ ఔట్ లెట్ల వద్ద సిబ్బందికి సహకరించాలని సూచించింది. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలు, ప్రజల వినియోగానికి అవసరమైన స్థాయిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిరంతరం సరఫరా చేసేందుకు తాము పూర్తి ఏర్పాట్లు చేశామని, అందువల్ల వీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తదని హామీ ఇస్తూ ప్రజల్లో అనవరమైన భయాలను తొలగించే ప్రయత్నం చేసింది.