సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి :​ లక్ష్మీపార్వతి

సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి :​ లక్ష్మీపార్వతి

నల్గొండ అర్బన్, వెలుగు : మారుతున్న కాలానికి అనుగుణంగా కవులు, రచయితలు, మేధావులు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్  లక్ష్మీపార్వతి అన్నారు. పుడమి సాహితీ వేదిక తెలంగాణ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల పుడమి రత్న విశిష్ట సేవా పురస్కారం-2023ను ఆదివారం పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో నల్గొండ లోని పెన్షనర్స్ భవన్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురికి లక్ష్మీపార్వతి పురస్కారాలను అందజేసి మాట్లాడారు. సామాజిక సేవలను గుర్తించి పుడమి రత్న అవార్డులను అందజేయడం అభినందనీయమని పుడమి సాహితీ సంస్థను ఆమె కొనియాడారు.  సాహితీ రంగంలో నల్గొండ జిల్లాకు ఎంతో చరిత్ర ఉందన్నారు. సాహిత్యం ద్వారా  మార్పులు తెచ్చేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు. పుడమి సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చిలుముల బాల్​ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి, రిటైర్డ్  ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు.