గోడపై పాకి.. సీలింగ్‌కు ముద్దుపెట్టిన చిచ్చర పిడుగు

V6 Velugu Posted on Sep 19, 2021

స్పైడర్‌‌ మ్యాన్ బిడ్డనా.. అన్నట్టుగా ఈ చిన్నారి చేస్తున్న ఫీట్లు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. నేలపై పాకినట్లుగా స్పీడ్‌గా గోడపై పాకేస్తోంది ఈ బుడ్డది! సాలీడు వెళ్లినట్లుగా వెళ్లి.. కాళ్లు ఊపుతూ సర్కస్‌ ఆడినట్లు..  స్టెప్పులు వేసింది. సీలింగ్‌కు ముద్దు పెట్టి.. ఏమాత్రం భయం లేకుండా నేలపైకి ఒక్కసారిగా దూకేసింది. ఈ చిన్నారి సాహసాలను చూస్తే ఎవరికైనా ముద్దు రావాల్సిందే. అంతేనా ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. ‘‘స్పైడర్ మ్యాన్ డాటర్” అన్న క్యాప్షన్‌తో Fun Viral Vids అనే ట్విట్టర్‌ అకౌంట్‌‌లో పోస్ట్ అయిన ఆ చిన్నారి వీడియో ఇప్పుడు  వైరల్ అవుతోంది.

55 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఓ పాప రివర్స్‌లో చేతులు వెనక్కి పెట్టి గోడపై పాకుతూ సీలింగ్ వరకూ వెళ్లింది. పైకి చేరుకున్నాక.. కాళ్లు అలా ఊపుతూ సర్కస్ ఫీట్లు చేసింది. ఆ చిన్నారిని కింది నుంచి వీడియో తీస్తున్న పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు. Fun Viral Vids ట్విట్టర్‌‌లో ఈ నెల 13న పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇవాళ సాయంత్రం 4 గంటల సమయానికే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చిన్న వయసులోనే సూపర్ బ్యాలెన్సింగ్, గ్రిప్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటూ రీట్వీట్లు చేస్తున్నారు.

Tagged Viral Video, little girl, wall climb

Latest Videos

Subscribe Now

More News