శిథిలాల కింద 4 రోజులు.. చావును జయించిన చిన్నారి

శిథిలాల కింద 4 రోజులు.. చావును జయించిన చిన్నారి

ఇజ్మిర్(టర్కీ): టర్కీలో మరో చిన్నారి చావును జయించింది. భూకంప ధాటికి కూలిన బిల్డింగ్ శిథిలాల కిందే నాలుగు రోజుల పాటు ఉన్న మూడేండ్ల పాప ప్రాణాలతో బయటపడింది. 91 గంటల పాటు శిథిలాల కింద చావుతో పోరాడిన ఆ చిన్నారి ఐడ్గా గెజ్గిన్ ను రెస్క్యూ సిబ్బంది మంగళవారం బయటకుతీశారు. ఆమె ప్రాణాలతో బయటపడడంతో సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు .‘‘8 అంతస్తుల బిల్డిం గ్ కూలిపోయిన చోట సహా యక చర్యలు చేపట్టాం . ఆ టైమ్ లో చిన్నారి అరుపులు వినిపించాయి. పాప ఉన్న ప్రదేశాన్ని గుర్తించగానే, ఆమె మా వైపు చూసింది. నాకు గూస్ బంప్స్ వచ్చాయి . మా కొలీగ్ అయితే ఏడ్చే శాడు” అని రెస్య్కూ సిబ్బం ది నుస్రెత్ ఆక్సాయ్ చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో పాపను రెస్క్యూ టీమ్ సోమవారం కాపాడింది. టర్కీ భూకంపంలో చనిపోయినోళ్ల సంఖ్య 104కు చేరింది. ఇప్పటి వరకు 147 మందిని రక్షించామని, వారంతా ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.