టాలీవుడ్ యంగ్ హీరో మౌళి తనూజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ‘#90s’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మౌళి టాలీవుడ్ బడా బ్యానర్లో హీరోగా జాక్‌పాట్ కొట్టేశాడు.
మైత్రి మేకర్స్ బ్యానర్‌లో హీరోగా..
యూట్యూబ్ వీడియోలతో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన మౌళి తనూజ్, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వెండితెరపైకి వచ్చి, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మౌళి హీరోగా సినిమా అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ (Donga Naa Koduku) అనే మాస్ మరియు ఫన్నీ టైటిల్‌ను ఫిక్స్ చేసారని టాక్.
డైరెక్టర్ శ్రీను ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఆయన సిద్ధం చేసిన కథ మౌళి తనూజ్ బాడీ లాంగ్వేజ్‌కు పూర్తిగా సరిపోతుందని, అందుకే ఈ కాంబినేషన్ సెట్ అయిందని తెలుస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా ప్రసెంట్ జనరేషన్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్. మరో రెండ్రోజుల్లో మూవీపై అధికారిక ప్రకటన రానుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ మౌళి తనూజ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉంది.
'లిటిల్ హార్ట్స్'తో మెగా హిట్
'లిటిల్ హార్ట్స్' మూవీ మౌళి తనూజ్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. కేవలం చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మౌళి తనూజ్ నటన, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అతని పరిణతి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఊహించని మెగా హిట్ అతని మార్కెట్‌ను పెంచింది. ఒక్క సినిమాతో అతను మీడియం రేంజ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
ప్రస్తుతం కొత్త దర్శకులతో పాటు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైత్రి మేకర్స్ రంగంలోకి దిగి ముందుగానే డీల్ సెట్ చేసుకుంది. కాగా, ఈ ప్రాజెక్ట్ కోసం మౌళికి ఏకంగా భారీ రెమ్యూనరేషన్ (కోటి రూపాయలు) కూడా వారు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క గ్రాండ్ హిట్‌తో ఈ స్థాయి పాపులారిటీ, మార్కెట్ అందుకోవడం నిజంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

