
ప్రేక్షకులు రిలేట్ అయ్యే కథా కథనాలతో ‘లిటిల్ హార్ట్స్’ ఆకట్టుకుంటుంది అని నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ అన్నారు. మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ ‘అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. ప్రేక్షకులు తమ లైఫ్‌లో జరిగిన ఇలాంటి విషయాలను గుర్తు చేసుకుంటారు. టీనేజ్‌లో ఉండే ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీని చూపిస్తున్నాం. ఈ ప్రేమకథలో పెద్ద ట్విస్ట్‌లు ఏమీ ఉండవు.
ఒకప్పుడు మనం ఇంత సిల్లీగా ఉన్నామా అనిపిస్తుంటుంది. రెండున్నర గంటలసేపు ప్రేక్షకులు అన్ని ఇబ్బందులు మర్చిపోయి ప్రశాంతంగా చూసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ ‘వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 200 థియేటర్స్‌లో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న మూడు సెంటర్స్‌లో ఇంటర్ విద్యార్థుల కోసం ఫ్రీ షోస్ వేస్తున్నాం. సెప్టెంబర్ 4నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తాం’ అని అన్నారు.