కేంద్రబడ్జెట్ లో రైతుబంధు : పీఎం కిసాన్ నిధి

కేంద్రబడ్జెట్ లో రైతుబంధు : పీఎం కిసాన్ నిధి

Rs. 6,000 For Every Small Farmer Into Their Bank Accounts, Says Piyush Goyalసార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం రైతు ఆకర్షక పథకాన్ని ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం ఇప్పటికే ఆమోదించిందని… ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. చిన్న, సన్నకారు రైతులను ఈ పథకం కింద లబ్దిదారులుగా ఎంపిక చేస్తామన్నారు. పీఎం సమ్మాన్ నిధి స్కీమ్ కింద… మూడు విడతలుగా రైతులకు రూ.2వేల రూపాయల సాయం చొప్పున అందిస్తామని చెప్పారు. రైతుల అకౌంట్లలోకి ఏడాదికి రూ.6వేల సాయం కేంద్రం నుంచి అందుతుందని చెప్పారు పియూష్ గోయెల్.

అర్హులు వీరే..

ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులు.  దేశ మంతటా 12కోట్లమందికి లబ్ది కలుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ పథకం కోసం కేంద్ర బడ్జెట్ లో రూ.75వేల కోట్లు కేటాయించారు. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు.

తెలంగాణలో రెండు దఫాలుగా రైతుల అకౌంట్లోకి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు అందిస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో రూ.4వేల చొప్పున  ఏడాదికి రూ.8వేలు అందించింది టీఆర్ఎస్ ప్రభుత్వం.