లోన్ యాప్స్ వేధింపులకు యువకుడు బలి

లోన్ యాప్స్ వేధింపులకు యువకుడు బలి

హైదరాబాద్ లో లోన్ యాప్స్ ఆగడాలు శృతిమించాయి. తాజాగా లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. జవహర్ నగర్ కు చెందిన మహమ్మద్ ఖాజా అనే యువకుడు 3 లోన్ యాప్స్ ద్వారా కుటుంబ అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకున్నాడు. అనంతరం లోన్ యాప్ సంస్థల నుండి డబ్బులు చెల్లించమని విపరీతమైన ఒత్తిడి రావడంతో వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఖాజా ఉన్నత చదువులు చదువుకొని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఇటీవల కాలంలో లోన్ యాప్ వేధింపుల కేసులుఎక్కువయ్యాయి. వేధింపులు తాళలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య అధికమయ్యాయి. మీ ఆథార్ కార్డు, పాన్ కార్డు వుంటే చాలు ఎటువంటి ఆధారాలు అవసరం లేదంటూ అమాయకులకు ఎరవేస్తున్నాయి. ఇలా వారి ఎరలో పడ్డవారికి ఫోన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. అవి భరించని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.