
సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా మారటోరియం రుణగ్రహితలకు వడ్డీపై వడ్డీని నవంబర్ 5లోగా తిరిగి చెల్లిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పటికే ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆరు నెలల మారటోరియం పీరియడ్‌లో రుణాలపై వడ్డీ మాఫీ విషయంలో తన నిర్ణయాన్ని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది. మారటోరియం సమయంలో కొన్ని రకాల రుణాలపై వడ్డీ వదులుకునేందుకు సిద్ఢమని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.2 కోట్లు లోపుగల రుణాలకే వడ్డీ చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మారిటోరియం పై వడ్డీ రుణదాతలకు ఎప్పుడు చెల్లిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతుండగా..కేంద్రం కీలక ప్రకటన చేసింది. అన్నీ బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు నవంబర్ 5లోగా రుణగ్రహితలకు వడ్డీని చెల్లించాలని సూచించింది.