
హైదరాబాద్: స్వయం సహాయక బృందాల్లో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. కొంత చెల్లించిన తర్వాత చనిపోతే...చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు చెప్పారు.
నాబార్డు, ఏపీ మహిళాభివృద్ధి సమాఖ్య, ఎనబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఎంసీఆర్హెచ్ ఆర్డీలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అత్యుత్తమంగా పనిచేసిన డ్వాక్రా గ్రూపులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందించారు.