ఎమ్మెల్యే చెన్నమనేనిని నిలదీసిన స్థానికులు

V6 Velugu Posted on Sep 15, 2021

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దళితబంధు కోసం ఆందోళనకు దిగారు స్థానికులు. తమకు దళితబంధు అమలు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబును అడ్డుకున్నారు. దళితబంధు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పాలని నిలదీశారు.  వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లిలో కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వెళ్లారు ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈ సమయంలో స్థానిక దళిత యువకులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఐతే వారికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే చెన్నమనేని.

Tagged vemulawada, Dalitbandhu, Locals depose, MLA Chennamaneni

Latest Videos

Subscribe Now

More News