
- చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన 55 ఏళ్ల మహిళ పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకటో జోన్‌కు చెందిన గంధం శ్రీకాంత్అనే సింగరేణి కార్మికుడు తాను వండిన వంట ఉడికిందా లేదా చూడాలంటూ కాలనీకి చెందిన ఓ మహిళను కోరాడు.
ఇంట్లోకి వచ్చిన ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో భయంతో గట్టిగా అరిచింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు, కాలనీవాసులు శ్రీకాంత్‌ను పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.