ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల నమోదు ఎక్కువ అవుతోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి లో ఒక వ్యక్తి ద్వారా 8మందికి కరోనా వ్యాపించింది. నేలకొండపల్లిలో 9మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా పాజిటివ్ ఉన్న షాపు యజమాని నుంచి మరో 8 మందికి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి కుటుంబంలోని ముగ్గురికి కరోనా వ్యాప్తి చెందగా..ఆ షాపులో పనిచేసే మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. దీంతో నేల కొండపల్లి ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా ఎంతమందికి ఈ వైరస్ సోకిందో తెలియక ప్రజలు ఆందోళ పడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలించారు. అంతేకాదు 14 రోజుల పాటు నేలకొండపల్లిలో పూర్తి లాక్డౌన్ విదించనున్నట్టు అధికారులు చెప్పారు. ప్రజలెవ్వరూ బయటకు రాకూడదని.. అధికారులు తదుపరి ఆదేశాలిచ్చేవరకూ షాపులూ తెరవకూడదని జిల్లా కలెక్టర్ సూచించారు.
