కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెచ్చిన గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ

కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెచ్చిన  గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: లాకర్లు తయారు చేసే గోద్రేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. ఇండ్లలో వాడుకునే లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు,  బ్యాంకులు వంటి పెద్ద ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్లలో దొంగతనాలను ఆరికట్టేందుకు, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యూరిటీని కొలిచేందుకు, క్యాష్ లెక్కించేందుకు  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకొచ్చింది. వీటి బేసిక్ వెర్షన్ల  ధరలు రూ.80,000–1,50,000 మధ్య ఉన్నాయి. హయ్యర్ ఎండ్ మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే ఉన్న లాకర్లతో కనెక్ట్ చేయొచ్చని, ఎవరైనా లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలవంతంగా ఓపెన్ చేయాలని చూస్తే దట్టమైన పొగ విడుదల అవుతుందని కంపెనీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుష్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోఖలే అన్నారు.  స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు పెట్టొచ్చని, లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేస్తే ఒకేసారి 8 నెంబర్లకు కాల్స్ , మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వస్తాయని వివరించారు. అదే విధంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యూరిటీని కొలిచేందుకు అక్యూగోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గోద్రేజ్ సెక్యూరిటీ  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. జ్యువెలర్లే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  లాంచ్ చేశారు. క్రషేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో క్యాష్ కౌంటింగ్ మెషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  తెచ్చారు. ఇందులో అన్ని రకాల డినామిటేషన్లను ఒకేసారి  కౌంట్ చేయొచ్చు. 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌022–23 లో రూ.850 కోట్ల రెవెన్యూ సాధించామని, ఇందులో 10–12 శాతం తెలంగాణ, ఆంధ్రా నుంచే వచ్చిందని పుష్కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోఖలే అన్నారు.