ఇవాళ్టితో(మే30) ఏడో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ఇవాళ్టితో(మే30) ఏడో విడత  ఎన్నికల ప్రచారానికి తెర

సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. ఇవాల్టితో(మే30) ఎంపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు చివరి విడత ప్రచారం ముగియనుంది. జూన్ 1న చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, బెంగాల్ 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3 స్థానాలు, చండీగఢ్ లో ఒక లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగనుంది. 57 ఎంపీ స్థానాలకు బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు ఉన్నారు.

జూన్ 1 జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్ సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. ఏప్రిల్ 19వ తేదిన ప్రారంభమైన మొదట దశ పోలింగ్.. జూన్ 1 జరిగే ఏడో విడత పోలింగ్ తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.

ఫస్ట్ ఫేస్ లో 102 లోక్ సభ స్థానాలు.. రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. థర్డ్ ఫేజ్ లో 92 లోక్ సభ స్థానాలు.. నాలుగో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి 92 లోక్ సభ స్థానాలు..ఐదో దశలో 49 లోక్ సభ సీట్లు.. ఆరో దశలో 58 లోక్ సభ సీట్లుకు ఎన్నికలు జరిగాయి. ఏడో దశలో భాగంగా 57 లోక్ సభ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు నెలలకు పైగా కొనసాగిన ఈ ఎన్నికల ప్రక్రియ జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది.