పార్లమెంట్ సమావేశాలు: లోక్ సభ వాయిదా

పార్లమెంట్ సమావేశాలు: లోక్ సభ వాయిదా

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన  కాసేపటికే వాయిదాపడ్డాయి. ఇటీవల మరణించిన సభ్యులకు నివాళులర్పిస్తూ లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా. అనంతరం రాజ్యసభ  కూడా మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

23 రోజులు సమావేశాలు

మొత్తం 23 రోజులు సెషన్ సాగనుండగా.. 17 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. అయితే, ఈ సారి వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో మొదలై, కొత్త భవనంలో ముగుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉభయ సభల్లో మొత్తం 37 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 

ఇందులో 8 బిల్లులపై చర్చించి పాస్ చేయాల్సి ఉంది. మిగిలిన 21 బిల్లులు ప్రవేశపెట్టడం కోసం లిస్ట్ చేస్తారు. ఈ సెషన్ లోనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.