కాంగ్రెస్ ప్రయోగం : హేమ మాలినిపై బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ

కాంగ్రెస్ ప్రయోగం :  హేమ మాలినిపై  బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ  కొత్త ప్రయోగం చేసేందుకు సిద్దమైంది.  ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ దింపింది.  మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హేమ బరిలోకి దిగగా.. విజేందర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీతో కలిసి బరిలోకి దిగుతుంది.  

ఈ స్థానం నుంచి హేమ మాలిని వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.  2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరిపై హేమమాలిని మూడు లక్షల ఓట్లతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీకి చెందిన కున్వర్ నరేంద్ర సింగ్‌పై రికార్డు స్థాయిలో ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఆమె  సిద్ధమవుతోంది.  మరి  హేమపై విజేందర్ పైచేయి సాధిస్తాడా? లేదా అనేది చూడాలి. 

విజేందర్ సింగ్ కూడా గతంలో ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజేందర్ సింగ్..   దక్షిణ ఢిల్లీ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. చైనాలోని బీజింగ్‌లో జరిగిన 2008 ఒలింపిక్స్‌లో కాంస్యంతో సహా భారత్‌కు విజేందర్ అనేక పతకాలు సాధించాడు.