లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో రూ.11 వందల కోట్లు సీజ్

లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో రూ.11 వందల కోట్లు సీజ్

2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో నగదు పట్టుబడినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. మొత్తం ఏడు విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రూ.1100 కోట్ల నగదు, భారీగా ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ. 390 నగదుతో పోలిస్తే  2024 లోక్ సభ ఎన్నికల్లో 182 శాతం ఎక్కువ. మే30 నాటికి ఇన్ కం ట్యాక్స్ డిపార్టుమెంట్ రూ. 1100 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంది.   

రిపోర్టు ప్రకారం..ఢిల్లీ, కర్ణాటకలో అత్యధికంగా నగదు పట్టుబడింది. ఢిల్లీలో రూ. 200 కోట్లు, కర్ణాటకలో 150 కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. తర్వాత తమళనాడు రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో మొత్తం కలిపి రూ. 100 కోట్లకు పైగా నగదు,నగలు సీజ్ చేశామని ఐటీ శాఖ వెల్లడించింది. 

మార్చి 16, 2024న లోక్ సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల తేదీలను ప్రకటించిన నాటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి వచ్చింది. 

Also read : లోక్‌సభ ఎన్నికలు 2024: ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా ఏంటి?

మార్చి 16 నుండి దేశవ్యాప్తంగా MCC అమలు చేయబడినప్పటి నుండి ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, ఉచితాలు, డ్రగ్స్, ఆభరణాలు, ఇతర వస్తువుల తరలింపుపై నిఘా పెట్టాయి కేంద్ర ఏజెన్సీలు. ఎన్నికల్లో అక్రమ నగదు తరలింపును తనిఖీ చేయడానికి ప్రతి రాష్ట్రం 24x7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.