పుప్పాలగూడ భూములపై ..విచారణకు లోకాయుక్త అంగీకారం

పుప్పాలగూడ భూములపై ..విచారణకు లోకాయుక్త అంగీకారం
  •  అరవింద్ కుమార్‌‌‌‌‌‌‌‌ను విచారించాలని అధికారులకు ఆదేశం

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ పుప్పాలగూడలోని సర్వే నంబర్​ 277, 280, 281 భూములకు సంబంధించి విచారణ జరిపించేందుకు లోకాయుక్త అంగీకరించింది. ఈ భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని, విచారించి చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో అడ్వకేట్ ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేశారు. 

హెచ్‌‌‌‌ఎండీఏ మెట్రో పాలిటన్ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ ఐఏఎస్, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, డీఎస్‌‌‌‌ఆర్ ఎస్ఎస్‌‌‌‌ఐ అధినేత రఘురామరెడ్డిని విచారిస్తే అక్రమాలు బయటపడుతాయని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. దీనిపై పూర్తిస్థాయిలో  చారణ జరిపి సెప్టెంబర్ 28లోగా నివేదిక ఇవ్వాలని లోకాయుక్త  ఆదేశించింది.