DC Trailer Review: దుమ్మురేపుతున్న ‘డీసీ’ ట్రైలర్.. హీరోగా లోకేష్ కనగరాజ్ మాస్ విధ్వంసం..!

DC Trailer Review: దుమ్మురేపుతున్న ‘డీసీ’ ట్రైలర్.. హీరోగా లోకేష్ కనగరాజ్ మాస్ విధ్వంసం..!

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ  ‘డీసీ’ (Devadas + Chandra). కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజైన ‘డీసీ’ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలతో డైరెక్టర్గా గుర్తింపు పొందిన లోకేష్, ఇందులో హీరోగా హింసాత్మక అవతారంలో కనిపించి ఆకట్టుకున్నారు. అనిరుధ్ బీజీఎమ్, లోకేష్ యాక్షన్ ఆడియన్స్లో అంచనాలు పెంచేశాయి.

‘రాకీ’, ‘సాని కాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’, వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన అరుణ్ మాథేశ్వరన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపించారు. లాస్ట్ టైం విడుదలైన టీజర్‌తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచిన లోకేష్, ట్రైలర్తో మరో స్థాయికి తీసుకెళ్లారు. లోకేష్ దేవదాస్ పాత్రలో, వామికా గబ్బి చంద్ర పాత్రలో అదరగొట్టారు. శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన క్లాసిక్ 'దేవదాస్' నవలకు ఇది ఒక మోడరన్, వయొలెంట్ వెర్షన్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

హీరోగా లోకేష్ విశ్వరూపం..

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)తో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారు. ‘ఖైదీ', ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ల చిత్రాలతో దర్శకుడిగా స్ట్రాంగ్ సిగ్నేచర్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే లోకేష్ మేకప్ వేసుకుని వెండితెరపై హీరోగా విశ్వరూపం చూపించబోతున్నాడు. అయితే, తెరపై నటుడిగా ఎలాంటి ఇమేజ్ సొంతం చేసుకోనున్నాడో అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అంచనాలు పెంచిన డైలాగ్‌..

ట్రైలర్ ప్రారంభంలో కారులో ఓ మహిళ భయంతో కేకలు వేస్తున్న సన్నివేశం కనిపిస్తుంది. ఆ తర్వాత తుపాకీ కాల్పులు, రక్తపాతం, హై వోల్టేజ్ యాక్షన్‌తో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. డబ్బు ఆశతో చంద్రను ప్రమాదకర పరిస్థితుల నుంచి దేవదాస్ ఎలా కాపాడతాడన్నదే కథగా తెలుస్తోంది. చివర్లో వచ్చే “ఆమె పేరు చంద్రరా..” డైలాగ్ ఆసక్తిని పెంచగా, బలమైన భాష కారణంగా కొన్ని పదాలను మ్యూట్ చేశారు. మొత్తానికి ‘డీసీ’ మూవీ.. రియలిస్టిక్, రా ట్రీట్‌మెంట్‌తో ఉండబోతుందని అర్ధమవుతుంది. అయితే, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయడంతో, పూర్తి సినిమాలో హింస ఏ స్థాయిలో ఉంటుందోనని ఆసక్తి కూడా పెరిగింది.