
జమ్మూ : దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే లోక్‌సభ సీటుకు మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ ఎంపీ స్థా నానికి మూడు విడతల్లో (ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, మే6న) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. దీర్ఘకాలం ఖాళీగా ఉన్న ఎంపీ స్థా నంగానూ అనంతనాగ్ రికార్డులకెక్కింది. 2016లో మహబూబా ముఫ్తీ (పీడీపీ) రాజీనామా చేసినప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఇటీవల టెర్రర్ దాడి జరిగిన పుల్వా మా ఈ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది.