
మెదక్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు.
కొత్త ప్రభాకర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
పుట్టిన స్థలం: పోతారం తల్లితండ్రులు: కిష్టారెడ్డి,బాలమ్మ బార్య:మంజుల,
పిల్లలు: పృథ్వీకిష్ణారెడ్డి, కీర్తన.
విద్యార్ఘతలు : ఎమ్మెస్సీ
రాజకీయ చరిత్ర: వ్యాపారాలతో సేవా కార్యక్రమాలనే చేపట్టిన ఆయన 2007లో తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు ఆర్థిక వనరులను సమకూర్చడంలో తనవంతుగా పాత్ర వహించారు. 2014 లో దుబ్బాక నియోజక వర్గ టిక్కెట్‌ను ఆశించిన ప్రభాకర్‌రెడ్డికి
అవకాశం రాకపోవడంతో నిరాశ చెందలేదు. టీఆర్‌ఎస్ అదినేత కేసీఆర్ పిలుపు మెరకు ఆయన సార్వత్రీక ఎన్నికల్లో గజ్వేల్ ఎన్నికలను భుజాన వేసుకున్నారు. సీఎం కేసీఆర్ గెలుపుకు ఆయన గజ్వేల్‌లో కీలక పాత్ర పోషించారు. సీఎం పదవి చేపట్టి మెదక్ పార్లమెంటుకు రాజీనామా చేసిన కేసీఆర్ స్థానంలో ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు.
తనకు నమ్మకంగా పనిచేసి, పార్టీని వదలకుండా పని చేసినందుకు గుర్తింపుగా ఆయన రాజీనామా చేసిన స్థానంను ప్రభాకర్‌రెడ్డికి అందించడంతో మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బారీ మెజార్టీని సాధించారు.
బందుత్వాలు: తన తాత కిష్టారెడ్డి కూతురు కుమారుడైన ప్రభాకర్‌రెడ్డిని దత్తత తీసుకోవడంతో ఆయన పోతారం గ్రామంలోనే పెరిగాడు. కిష్టారెడ్డి కుమారుడు గాల్‌రెడ్డి గంబీర్‌పూర్ గ్రామ సర్పంచుగా పదిహేనేండ్లు కొనసాగారు. ఆయన రాజకీయాలను పునికిపుచ్చుకున్నారు. గాల్‌రెడ్డి కూతురును
ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చి పెండ్లి చేశారు. వ్యాపారాలలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రభాకర్‌రెడ్డి రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు.
సోనీట్రావేల్స్ ద్వారా వ్యాపారాలను సాగించి, రియల్ వ్యాపారాలు, కాంట్రాక్టులు నిర్వహించారు. అభివృద్ది కార్యక్రమాలల్లో: మెదక్ పార్లమెంటు పరిదిలో తనకంటూ ముద్రను సంపాదించుకున్నారు.