రాష్ట్రంలో పెరిగిన లోక్ సభ ఎన్నికల హీట్

రాష్ట్రంలో పెరిగిన లోక్ సభ ఎన్నికల హీట్

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హీట్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందే.. పార్టీల మధ్య సవాళ్లు జరుగుతున్నాయి. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తుందన్న కేటీఆర్ కు బీజేపీ నేతలు సవాళ్లు విసిరారు. NDA ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ సవాల్ చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సవాల్ విసిరారు.  NDA సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా అంటూ సవాల్ చేశారు. 16 సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు.

గాంధీభవన్ కు తెలంగాణ భవన్ కు తేడా లేకుండా పోయిందన్నారు పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. కాంగ్రెస్, టీడీపీకి ఓటేసినవాళ్లు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. హరీష్ రావుకు కేటీఆర్… కేటీఆర్ కు హరీష్ రావు ప్రతిపక్షంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 300 లోక్ సభ స్థానాలు గెలిచి.. మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ బండారు దత్తాత్రేయ. సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరినవారిని కండువా కప్పి ఆహ్వానించారు. ప్రధానిగా నరేంద్రమోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

మోడీ కోసం దేశం – దేశం కోసం మోడీ నినాదంతో ఎన్నికులకు వెళ్తామన్నారు బీజేపీ నేతలు.  ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీనే అన్నారు.