
లోక్ సభ ఎన్నికల్లో హరీష్ రావును పక్కన పెట్టామనేది నిజం కాదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెదక్‌లో టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచినా.. సిద్దిపేటలో పార్టీ మెజారిటీ తగ్గిందని గుర్తు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండింగ్ కనిపించిందన్నారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలుపు.. గెలుపు కాదన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదని.. కానీ 6 శాతం ఓట్లు పెరిగాయన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలూ ఊహించలేదన్నారు. నరేంద్రమోడీ హవాతోనే తెలంగాణలో బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయన్నారు. 16 సీట్ల కోసం గట్టి ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితం రాలేదన్నారు.