కొత్త ఎంపీలకు లోక్ సభ గైడ్ లైన్స్

కొత్త ఎంపీలకు లోక్ సభ గైడ్ లైన్స్

మరో 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఫలితాల్లో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీ అభ్యర్ధులకు సంబంధించి లోకసభ జనరల్ సెక్రటరీ స్నేహలత శ్రీవాత్సవ  ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.

ఎంపీలు ఢిల్లీకి వచ్చేటప్పుడు, వారికి రిటర్నింగు అధికారులు ఎన్నికైనట్లుగా ఇచ్చే “ఒరిజనల్ సర్టిఫికెట్ల” ను వెంట తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.  ఎంపీలందరికీ ఒకేసారి పర్మినెంట్ కార్డులు జారీ చేయనున్నట్టు ఆమె వెల్లడించారు.

కొత్తగా ఎన్నికై ఢిల్లీకి వచ్చే  లోకసభ అభ్యర్ధుల కోసం  ( ఎం.పిలు) ఎయిర్ పోర్టు, పలు రైల్వే స్టేషన్ లలో గైడ్ పోస్ట్ లను ఏర్పాట్లు చేసినట్టు ఆమె తెలిపారు. గతంలో వారికోసం హోటళ్ల లో ఏర్పాటు చేసే వసతి విధానాన్ని ఈ సారి రద్దు చేశామన్నారు.

ఎంపీలకు వెస్టర్న్ కోర్టు, మరియు కొత్తగా నిర్మించిన  వెస్టర్న్ కోర్టు అనుబంధ భవనాలలోనూ , వివిధ రాష్ట్రాల భవనాలలోనూ  తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్టు స్నేహలత తెలిపారు.

ఒక్కో నోడల్ ఆఫీసర్ కు 8 నుంచి 10 మంది ఎంపీల చొప్పున కేటాయించామన్నారు. వారందరికీ  ఎప్పటికపుడు ఎంపీలను సంప్రదిస్తూ, సహాయ సహకారాలు అందించే బాధ్యతలను అప్పగించడం జరిగిందని ఆమె అన్నారు.