పొడవైన కాళ్లతో ప్రపంచ రికార్డు

పొడవైన కాళ్లతో ప్రపంచ రికార్డు

అమెరికా: పొడవైన కాళ్లతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది 17 ఏళ్ల అమెరికా అమ్మాయి. యుఎస్ఏ కు చెందిన మ్యాక్ కురియన్ అనే యువతి పొడవైన కాళ్లతో వరల్డ్ రికార్డు సృష్టించిందని తెలిపింది గిన్నిస్ బుక్. 17 ఏళ్ల వయసున్న ఈ సొగసరి 4 అడుగుల 5 అంగుళాల కాళ్లను కలిగి.. ఆరు అడుగుల పది అంగుళాల ఎత్తుకు ఎదిగి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్పింది.  మ్యాక్ కురియన్ ప్రపంచంలోనే అతి ఎత్తైన మహిళగా కూడా ఆమె రికార్డు బ్రేక్ చేయాలంటే కొన్ని అంగుళాలు పెరగాలని చెబుతున్నారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు.  ప్రస్తుతం చైనాకు చెందిన సన్ ఫాంగ్ ఏడు అడుగుల మూడు అంగుళాలతో ప్రపంచంలోనే పొడవైన మహిళగా రికార్డు అందుకున్నారు.