SBI ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన ఏటీఎం చార్జీలు

SBI ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన ఏటీఎం చార్జీలు

న్యూఢిల్లీ: ఇతర బ్యాంకుల ఏటీఎం లావాదేవీలపై చార్జీలను ఎస్​బీఐ మార్చింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని కొనసాగిస్తూనే, ఆపై చేసే విత్‌‌డ్రాయల్స్‌‌పై చార్జీలను పెంచింది. 

ఉచిత పరిమితి ముగిశాక డబ్బు తీస్తే రూ.23 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. గతంలో ఇది రూ.21 గా ఉండేది. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.11 తో పాటు జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో ఇది రూ.10 గా ఉంది. సాలరీ కస్టమర్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి గతంలో ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి. గత నెల నుంచి ఈ పరిమితి నెలకు 10కి తగ్గింది. ఆ తర్వాత చేసే లావాదేవీలకు చార్జీలు ఉంటాయి. ఎస్​బీఐ ఏటీఎంలలో ఎస్​బీఐ కార్డులు వాడేవారికి మార్పు లేదు.  బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బీఎస్​బీడీ) ఖాతాదారులకూ పాత చార్జీలే వర్తిస్తాయి.