ఫొటో గ్రాఫర్ గా, మోడల్ గా రాణిస్తున్న చువాండో టాన్

 ఫొటో గ్రాఫర్ గా, మోడల్ గా రాణిస్తున్న చువాండో టాన్

ఫొటోలో చూస్తుంటే పాతికేండ్ల కుర్రాడిలా కనిపిస్తున్న ఇతని పేరు చువాండో టాన్. సింగపూర్ కి చెందిన సెలబ్రెటీ ఫొటో గ్రాఫర్ అండ్ మోడల్. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అవుతున్నాడు. ఇతని మోడలింగ్ ఫొటోలకి యువతులు తెగ అట్రాక్ట్ అయిపోతున్నారు. అయితే, ఇతని అసలు వయసు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే పాతికేండ్లలా కనిపిస్తున్న ఇతని అసలు వయసు హాఫ్ సెంచరీ దాటేసింది. 

1967 లో పుట్టిన చువాండో, 1980లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 1990లో మాండరిన్ పాప్ సింగర్ గా అవతారం ఎత్తాడు. తర్వాత ఫొటోగ్రఫీ రంగంలోకి అడుగుపెట్టి సెలబ్రెటీ ఫొటో గ్రాఫర్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు. తన లుక్స్ తో ఆకట్టుకుంటున్న చువాండోకు ‘ప్రీషియస్ ఈజ్ ది నైట్’ అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. డైట్, ఎక్సర్ సైజే తన లుక్స్ మెయింటెనెన్స్ కి కారణం అంటున్న ఈయన, ప్రస్తుతం1.2 మిలియన్ ఫాలోవర్లతో సింగపూర్ సెలబ్రెటీల జాబితాలో ఒకడిగా ఉన్నాడు.