ఆర్యాన్ తో సెల్ఫీ దిగిన వ్యక్తికి లుకౌట్ నోటీసు జారీ

V6 Velugu Posted on Oct 14, 2021

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో వైరల్ సెల్ఫీలో కనిపించిన ప్రైవేట్ డిటెక్టివ్ గోసవిపై పోలీసులు ఫోకస్ చేశారు. మూడు చీటింగ్ కేసుల్లో నిందితుడైన గోసవిపై ఇప్పుడు పూణే పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ దిగటంతో ఆర్యన్ ఖాన్ కు గోసవికి ఉన్న సంబంధం ఏమిటి అన్నదానిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. 2018లో ఫరస్ఖానా పోలీస్ స్టేషన్‌ లో నమోదైన చీటింగ్ కేసులో పరారీలో ఉన్న కెపి గోసవిపై మేము లుకౌట్ సర్క్యులర్ నోటీసు జారీ చేశామని పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా తెలిపారు. క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ, డ్రగ్స్ రికవరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది స్వతంత్ర సాక్షులలో గోసవి ఒకరు కాగా.. ఈ కేసులో గోసవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందన్న అనుమానంతో అతనిని అరెస్ట్ చెయ్యటం కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే గోసవిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని పూణేకు చెందిన వ్యక్తిని మోసం చేసినందుకు గోసవిపై కేసు నమోదైందన్నారు. ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్ళకుండా జారీ చేసే నోటీసులను లుకౌట్ సర్క్యులర్ అంటారు.

Tagged Man, viral, Selfie, lookout notice, , aryan khan

Latest Videos

Subscribe Now

More News