చైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు

చైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు

ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందే

షాంఘై: చైనా ఆర్ధిక నగరం షాంఘై సిటీలో కొవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. గత రెండు నెలల నుంచి షాంఘైలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు ఇవాళ రాత్రి నుంచి ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా ఆంక్షలు సడలించారు. షాంఘై సిటీలో సుమారు 2 కోట్ల 50 లక్షల మంది నివసిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున సిటీలో నివిసిస్తున్న వారిలో 6 లక్షల 50 వేల మంది ఇళ్లకే పరిమితం కానున్నారు. 
ప్రస్తుతం చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోంది. కొవిడ్ సోకిన వారు క్వారంటైన్ కావాలి లేదా హాస్పిటల్ లో చేరాల్సి ఉంటుంది. కొవిడ్ సోకిన వారికి కాంటాక్ట్ లో ఉన్నవారందరీ పరీక్షిస్తున్నారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేవాళ్లు కచ్చితంగా కొవిడ్ రూల్స్ పాటించాలి. తమ స్మార్ట్ ఫోన్లపై గ్రీన్ హెల్త్ కోడ్ ను చూపిస్తేనే... ఇంటి కాంపౌండ్ లేదా బిల్డింగ్ దాటేందుకు అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ వాడాలన్నా.. లేక బ్యాంకులు, షాపింగ్ మాల్స్ కు వెళ్లాలన్నా.. కచ్చితంగా 72 గంటలలోపు తీసిన నెగటివ్ పీసీఆర్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. మరో సిటీకి వెళ్లాల్సిన వారు 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలి.

 

ఇవి కూడా చదవండి

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

నాలాలు కబ్జా అయినా పట్టించుకోలేదు

సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు