
కేరళలోని వాయనాడ్‍లో పర్యటిస్తున్నారు LOP నేత రాహుల్ గాంధీ. ఆయనతోపాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొండచరియలు విరిగిపడిన చూరుల్ మలలో పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతులకు కుటుంబాలకు పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలకు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవాలన్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి సమయంలో దేశమంతా వయనాడ్ కు సాయంగా నిలబడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.