
వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ బ్యానర్ పై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి , డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణంతో సురేష్ పళ్ళ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కృష్ణ ఘట్టం. ఈ మూవీకి మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ (Moody Crab Film Festival) వారు 2022 లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు (Best Feature Film Award) తో సత్కరించారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ ను మాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించారు.
అయితే ఈ రోజు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిత్రం లోని కృష్ణుడి పద్యాన్ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక నిర్మాత సురేష్ పల్లా కృష్ణాష్టమి పండుగ సందర్భంగా కృష్ణ ఘట్టం నుంచి కృష్ణుడి పద్యాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సర్వలోక రక్షకుడు అయిన కృష్ణుడిని ఎవరు ఎప్పుడు ఎలా పిలువగలరని ఓ భక్తుడు అడిగిన ప్రశ్న కి శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఈ పద్యం అని వెల్లడించారు. ఈ అచ్చ తెలుగు పద్యం కృష్ణుడి భక్తులకు పండగలా ఉంటుందన్నారు. ఒక దశాబ్ద కాలం లో ఇలాంటి తెలుగు పద్య నాటకం మన తెలుగు చిత్రంలో ఎన్నడూ రాలేదన్నారు. ఈ పద్యం కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడికి నైవేద్యం లాంటిదన్నారు.
మా ఈ పద్యాన్ని 30 సంవత్సరాలుగా కృష్ణుడి వేషం వేస్తూ తెలుగు పద్యనాటకాలు చేస్తున్న గుమ్మడి గోపాలకృష్ణ గారు విడుదల చేశారు. అయన తమ చిత్ర ట్రైలర్ , పద్యానటకం చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారని చెప్పారు. తమ చిత్రాని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
చిత్రం పేరు : కృష్ణ ఘట్టం
తారాగణం: చైతన్య కృష్ణ, మాయ నెలూరి, సాషా సింగ్, DR.వెంకట్ గోవాడ, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, విశ్వనాథ్ GR, బొంబాయి పద్మ, ప్రసన్న కెంబూరి.
టెక్నిషన్స్:
రచన, దర్శకత్వం మరియు నిర్మాత: సురేష్ పల్లా
సంగీతం: పి ఆర్(PR)
సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్
బ్యానర్: వైల్డ్ వాల్చుర్ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్: బొంబాయి పద్మ
ఎడిటింగ్: వినయ్
కాస్ట్యూమ్ డిజైనర్: సుదీప్తి, బాంబే పద్మ & టీమ్
VFX: శివ (రైజ్ స్టూడియో), అనుజ్ (ప్లానెట్ గ్రీన్ స్టూడియో)
కో-డైరెక్టర్: శివ
కళా దర్శకుడు: రాజేష్, సురభి రాయల
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : విజయ్ నాగ్ యార్లగడ్డ (Vijay DigiTech)