సీతారాముల కల్యాణాన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు.. అనే తేడా లేకుండా భక్తులు కనులపండుగగా చేసుకుంటారు. ప్రతి రామాలయంలోనూ ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు సంప్రదాయబద్ధంగా తమ ఇళ్లలోనూ ఈ పండుగను జరుపుకుంటారు.
సీతను సహనానికి ప్రతీకగా చెప్తారు. రాముడిని కార్యసాధనకు ఉదాహరణగా భావిస్తారు. వాళ్లిద్దరి పెళ్లిరోజు అంటే సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని సాధించడమనే వ్యక్తిత్వ వికాస సూత్రం వీళ్లిద్దరి పెళ్లిలో ఉంది. అది నేటి యువతకు ఆదర్శం.
పుట్టిన రోజు.. పెళ్లి రోజు ఒకటే
రాముడు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం, కర్కాటక లఘ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని చెప్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి, రావణాసురుడ్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడయ్యింది.. సీతతో, రాముడి పెళ్లి జరిగింది అదే రోజని చెప్తారు. అలా మూడు సందర్భాలు ఒకటే రోజు కావడం. ఈ రోజు ప్రత్యేకత.
రాముడి పుట్టినరోజునే సీతారాముల కళ్యాణం జరపడానికి కారణం ఎవరో తెలుసా..! కంచర్ల గోపన్న.
ఎలా అనుకుంటున్నారా? భద్రాచలంతహసీల్దారుగా రామదాసు (కంచర్లగోపన్న పనిచేస్తున్నప్పుడు తొలిసారిసీతారాముల కళ్యాణం ఎప్పుడునిర్వహించాలనే సందేహం వచ్చింది.
అప్పుడు రామదాసు తన గురువైన రఘునాథభట్టాచార్యులు పండితులతో చర్చించి విష్ణువురాముడిగా భూమిమీద అవతరించిన రోజే కళ్యాణం జరపాలని నిర్ణయిం చాడు.ఆ రోజు నుంచి ( త్రేతా యుగం నుంచి) ఇప్పటి వరకు అది ఆచారంగా కొనసాగుతోంది.ఒక్క తెలుగు నేలపైనే కాకుండా దేశవిదేశాల్లోనూ ఇదే పాటిస్తున్నారు.
దశరథునికి పుత్రకామేష్టి యాగంలో నలుగురు కొడుకులు పుట్టినప్పుడు. వాళ్లకు నామకరణం చేసింది వశిష్టుడు. రామ అంటే రమయతి గుణై: ప్రజాయితి రామః” అని. రమించునది, ఆనందించునది.
ఆహ్లాదం సందునది అని అర్ధం.
వేదాల ప్రకారం సమస్త ప్రపంచానికి అగ్ని, సూర్యుడు, చంద్రుడు మాత్రమే ఆధారం. రామ శబ్దంలో ని... ర .. అంటే అగ్ని అంటే సూర్యుడు... మ ...అంటే చంద్రుడు. అగ్ని వల్లపాపం, సూర్యుడి వల్ల అజ్ఞానం, చంద్రుడి పల్ల తాపం తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే రాముడి పేరు వచ్చేటట్లు ఎంతోమంది రామయ్య, రామకృష్ణ, రమేష్ ... లాంటి పేర్లు పెట్టుకుంటారు.రేపే (2026 మార్చి 27) శ్రీరామ నవమి. ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ. రాముడిపై భక్తితో ఇష్టంతో జరుపుకునే పండుగ ఇది.
