పాక్ లో బయటపడ్డ 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం

పాక్ లో బయటపడ్డ 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం

పాకిస్తాన్లోని‌ కరాచి జిల్లాకు సమీపంలో ఇటీవల జరిపిన పురావస్తు శాఖ తవ్వకాల్లో పురాతనమైన హిందూ దేవాలయం ఒకటి బయటపడింది. స్వాత్‌ జిల్లాలోని బరీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో  తవ్వకాలను చేపట్టగా గురువారం  1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం కనిపించింది. ఇది శ్రీమహావిష్ణువు ఆలయంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం దాదాపు 1300 ఏళ్ల నాటిదని, హిందూ షాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. అంతే కాక ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆల‌య ప‌రిస‌రాల్లో ఒక కంటోన్మెంట్‌, వాచ్‌ ట‌వ‌ర్ జాడ‌లు కూడా గుర్తించారు పురావ‌స్తు శాఖ అధికారులు . స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కింద‌టి పురావ‌స్తు ప్ర‌దేశాలు ఉండ‌గా.. తొలిసారి 1300 ఏళ్ల నాటి నాటి జాడలు కనిపించాయ‌ని చెబుతున్నారు.