
హైదరాబాద్, వెలుగు: కేరళ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (కేఎల్), లార్డ్స్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ కలసి జాయింట్ వెంచర్‌ను ప్రారంభించాయి. దీనికి కాల్ లార్డ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టాయి. ఈ సంస్థను కేరళలోని ఆలమూడు వద్దనున్న కేఏఎల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రారంభించారు.
లార్డ్స్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక నూతన ఏఐ బ్రాండ్ అని, ఈ జేవీతో స్మార్ట్, పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సదుపాయాలు అందిస్తామని ప్రకటించింది. కేరళ పరిశ్రమల మంత్రి రాజీవ్ ఈ సంస్థను ప్రారంభించారు.