- 13 మందికి గాయాలు
ఆర్మూర్, వెలుగు: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం రాత్రి కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు వెళ్తోంది. జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్ వద్ద ప్రయాణికులను దించేందుకు రోడ్డుపై ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి, ముగ్గురిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై జక్రాన్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

