కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయం

V6 Velugu Posted on Jun 19, 2021

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. హుజూరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేవ‌లం డబ్బు, అధికారాన్ని నమ్ముకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని విమర్శించారు.

హుజూరాబాద్‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ ప్రజాస్వామ్యబద్ధంగా కొన‌సాగితే TRS అభ్య‌ర్థికి డిపాజిట్‌ కూడా ద‌క్కద‌న్నారు ఈటల. TRS అధిష్టానం చివ‌ర‌కు వారి సొంత‌ పార్టీ నాయకులు.. ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే స్థితికి చేరుకుంద‌న్నారు. కేసీఆర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిన‌ప్ప‌టికీ రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమన్నారు ఈటల. హుజూరాబాద్‌లో బీజేపీయే గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

Tagged certain, etela, KCR power Loss, coming election

Latest Videos

Subscribe Now

More News