బోడకాకరతో ఇమ్యూనిటీ పవర్‌

బోడకాకరతో ఇమ్యూనిటీ పవర్‌

సీజనల్‌గా దొరికే కూరగాయల్లో బోడకాకర ఒకటి. దీన్ని తెలుగులో బొంత కాకర, ఆగాకర, అడవి కాకర అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ పెంచుతుంది. 

  • ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ –బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, విటమిన్ – ఎ, సి, డి2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, జింక్ యాంటీఆక్సిడెంట్స్‌ లాంటి పోషకాలు ఎక్కువ. ఈ పోషకాలు శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, అనారోగ్యం నుంచి కాపాడతాయి.
  • తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గును బోడకాకర తగ్గిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.
  • ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి డయాబెటిస్‌కి మందులా పని చేస్తుంది.
  • వర్షాకాలంలో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ నుంచి కూడా కాపాడుతుంది. ఇందులోని ఫోలేట్‌ శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
  • బోడకాకర తింటే పక్షవాతం, కంటి సమస్యలు, బీపీ, క్యాన్సర్‌‌ వంటివాటిని  నివారించొచ్చు. 
  • ఇందులోని ఫ్లేవనాయిడ్స్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముఖంపై ముడతలు రాకుండా చేస్తాయి. 
  • ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • గర్భిణిలు ఈ కాకర తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మంచిది.