
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 215 జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ హాజరై ప్రసంగించారు. లూయిస్ బ్రెయిలీ అంధుల లిపి కనుక్కోవడం గొప్ప విషయమన్నారు.
ఈ లిపిని ఉపయోగించుకుని చాలా మంది చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ జయరాం నాయక్, వెంకటేశ్వరమ్మ, కాంతారావు, సీనియర్ అసిస్టెంట్ జహీరుద్దీన్, రాములు, ఎఫ్ఆర్ఓ వెంకటేశ్, దివ్యాంగులు పాల్గొన్నారు.