ప్రేమతో ఏదైనా సాధ్యమే..

ప్రేమతో ఏదైనా సాధ్యమే..

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘లవ్ గురు’.  మృణాళిని రవి హీరోయిన్.  వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు. ఈనెల 11న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో విడుదల కాబోతోంది. సోమవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నాక ‘బిచ్చగాడు’ స్థాయి మరో విజయం సాధిస్తుందని దర్శకుడికి చెప్పాను. అది నిజం కాబోతున్నందుకు హ్యాపీ’ అని చెప్పాడు. 

ఈ సినిమా చూశాక మీ లైఫ్ పార్టనర్స్‌‌తో  మరోసారి ప్రేమలో పడతారని చెప్పింది మృణాళిని.  ‘ప్రేమ ద్వారా ఈ యూనివర్స్‌‌లో ఏదైనా సాధ్యమే అనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం’ అని దర్శకుడు అన్నాడు. ‘ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌టైన్ చేయడంతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తుంది’ అని మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, డిస్ట్రిబ్యూటర్ శశి అన్నారు.