ప్రేమాలయం : లవ్ మ్యారేజ్ లకు ఫేమస్

ప్రేమాలయం : లవ్ మ్యారేజ్ లకు ఫేమస్
హైదరాబాద్ రాజీవ్ రహదారి పక్కనే తాపాల లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ గుళ్లో ఏడాది పొడవునా ప్రేమ వివాహాలు జరుగుతుంటాయి. 2004 నుంచి ఇప్పటిదాకా 3,500 పైగా పెళ్లిళ్లు చేశామని ఆలయ కమిటీ మెంబర్లు చెప్పారు. పెళ్లి చేసుకునే ముందు వయసు ధ్రువీకరణ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అన్నీ సవ్యంగా ఉంటేనే పెళ్లికి అనుమతిస్తామన్నారు. ‘‘ఆలయంలో ప్రేమ వివాహాలు చేసుకోవడానికి వచ్చేవారికి ముందుగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తాం. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే వివాహం జరిపించి ఆలయం నుంచి వివాహ ధ్రువీకరణ పత్రాలను అందచేస్తాం’’ అని ఆలయ కమిటీ చైర్మన్‌‌‌‌ ఇనుకొండ నాగేశ్వర్ రెడ్ డి చెప్పారు.

‘‘ప్రేమ వివాహాలతో పాటు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా చేస్తాం. ఇక్కడ వివాహం చేసుకున్న వారు ఆలయంలో పెళ్లిరోజు వేడుకలు కూడా చేసుకుంటారు’’ అని ఆలయ అర్చకులు తిరు ణగిరి వేంకటాద్రి చార్యులు వివరించారు. మంథని ఆలయంలో…మంథనిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎనిమిదేళ్లలో 500కు పైగా ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ఇక్కడి లక్ష్మీనారాయణ స్వామికి చింతపండు స్వామిగా కూడా పేరుం ది. పూర్వం వీణవంకలో కొలువుదీరిన లక్ష్మీనారాయణ స్వామి.. అక్కడ నైవేద్యం పెట్టేవారు లేకపోవడంతో బ్రాహ్మణులు ఉండే ప్రాంతానికి వెళ్తానని చెప్పాడని, తర్వా త వ్యాపారులు చింతపండును తెచ్చే ఎడ్లబండ్లపై వచ్చి ఇక్కడ కొలువుదీరినట్లు పండితులు చెబుతున్నారు. అందుకే చింతపండు స్వామిగా పిలు స్తారు. ఆదిలాబాద్, చిత్తూరు, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాలవారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని సర్టిఫికెట్లు పరిశీలిం చి మేజర్‌‌‌‌ అని నిర్ధా రించుకున్నాకే వివాహం చేస్తున్నారు. ఇక్కడ 2005లో తొలిసారిగా మంథనికి చెందిన బండారి వరప్రసాద్, అనిత వివాహం జరిగింది.