జిల్లాలో కారుణ్య నియామకాలు : కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లాలో కారుణ్య నియామకాలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు : కారుణ్య నియామకాల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో 20 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు  కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ ఆకస్మాత్తుగా మృతి చెందినవారి కుటుంబ పోషణ భారం కాకుండా ఉండాలని కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. 20 మంది అభ్యర్థులకు నియామకపత్రాలు అందించామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.